PDPL: ఎల్పిజి సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. ఇప్పటికే 12 కేసులు నమోదు చేసి, 29 సిలిండర్లు సీజ్ చేశామన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు అనవసర ఆందోళన చెందవద్దని తెలిపారు. 3, 4 రోజుల్లో సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
MHBD: మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డులో బుధవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డులో సమస్యలు గురించి వారు సమావేశంలో చర్చించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి-రమేష్ హాజరై, సమస్యలు తెలుసుకున్నారు. వార్డు అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ సోమయ్య, కౌన్సిలర్ ముత్యం వెంకన్న తదరులున్నారు.
KMR: డోంగ్లీ, మద్నూర్ మండలాల్లోని మార్కెట్‌లో కందుల ధర తగ్గుముఖం పట్టింది. బుధవారం కందులు క్వింటాకు రూ.7,800 ధర పలుకుతోందని అడత్ వ్యాపారులు తెలిపారు. ఒక రోజులో క్వింటాకు రూ.100 ధర తగ్గిందని పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా రైతులు మాత్రం అమ్మకానికి ఆసక్తి చూపడం లేదు.
SRCL: తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ రాధా తెలిపారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలోని గురుకుల కళాశాలలో బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. మే 03న జరిగే ప్రవేశ పరీక్షకు ఈనెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, తదితర అధికారులు పాల్గొన్నారు.
KMR: రన్నింగ్ కారులో మంటలు వ్యాపించి కారు తగలబడిన ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి-సిరిసిల్ల రోడ్డుపై రన్నింగ్‌లో ఉన్న సీఎన్జీ కారులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన డ్రైవర్ శ్రీనివాస్ గౌడ్ కారును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ఈ క్రమంలో మంటలు ఎక్కువై కారు పూర్తిగా దగ్ధమైంది.
KMM: జిల్లాలోని బఫర్ గోదాముల నుంచి రేషన్ బియ్యం పంపిణీ తీరుపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 12 గోదాములకు ఇన్ ఛార్జ్‌లను నియమించి, సకాలంలో సరఫరా జరిగేలా చూడాలన్నారు.
వికారాబాద్: వడగళ్ల వర్షానికి వలసదారులకు చెందిన 150 మేకల మృతి చెందాయి. ఈ ఘటన పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లిలో చోటుచేసుకుంది. మేకల మృతితో వలసదారులు కన్నీరు మున్నీరవుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ముందుకు వచ్చి వారికి సహాయం చేయాలని ఆ రైతులు కోరారు.
JN: తెలంగాణ సాయుధ పోరాటంలో సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరన్‌పల్లి గ్రామ ప్రజలు చూపిన ధైర్యసాహసాలను గౌరవిస్తూ ఆ గ్రామానికి ‘వీర బైరాన్‌పల్లి’గా నామకరణం చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుకు, MLA పల్లా వినతిపత్రం అందజేశారు. ప్రాణాలతో బయటపడిన వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు.
HNK: భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాగ్రామంలో వరి పొలాలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు డా.గోన్యానాయక్, డా.పద్మజలు బుధవారం పరిశీలించారు. పరిశీలనలో భాగంగా వరి పంటలో కంకినల్లి సమస్య కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం రైతులకు సూచనలు చేశారు. HNK డివిజన్ ADA ఆదిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి పద్మ, తదితరులున్నారు.
SDPT: సిద్దిపేటలో ఆయిల్ పామ్ తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుదేనని నంగునూరు మండల బిఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. బుధవారం ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ నిర్మాణం గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇది తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.
KNR: సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి రైతు రచ్చ రాజుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. నిత్యం పాలిస్తూ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
KNR: సైదాపూర్ మండలంలోని గుండ్లపల్లిలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగు పడి రైతు రచ్చ రాజుకు చెందిన పాడి ఆవు మృతి చెందింది. నిత్యం పాలిస్తూ జీవనాధారంగా ఉన్న ఆవు మరణించడంతో ఆ పేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న తమకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
BHNG: జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. మోత్కూరు భారత్ గ్యాస్ గోడౌన్ వద్ద వినియోగదారులు వంటగ్యాస్ కోసం బారులు తీరారు. గత రెండు మూడు రోజులుగా వంట గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గురువారం కార్యాలయానికి గ్యాస్ వస్తుందన్న సమాచారం తెలుసుకున్న వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్‌లో నిలబడ్డారు.
MDK: గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేగుంట మండలం పోలంపల్లి సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మిస్వామి పేర్కొన్నారు. పోలంపల్లి పంచాయతీ పరిధి మూడో వార్డులో వార్డు సభ్యులు చింతకాయల ప్రవీణ్‌తో కలిసి మొరం పనులను పరిశీలించారు. మురుగు కాల్వను శుభ్రం చేస్తూ, ఇబ్బందులు ఉన్నచోట మట్టిని పోస్తున్నట్లు వివరించారు.