• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈద్గా వద్ద బందోబస్తు పరిశీలించిన అదనపు ఎస్పీ

MDK: జిల్లా నవాబ్‌పేట ఈద్గా వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బందోబస్తును అదనపు ఎస్పీ మహేందర్ శుక్రవారం పరిశీలించారు. భద్రతా చర్యలు, పార్కింగ్ ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు సూచనలు ఇచ్చారు. మసీదుల వద్ద పటిష్ట భద్రత కల్పించామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ప్రధాన రహదారులు, చౌరస్తాల్లో ప్రత్యేక పికెట్స్ ఏర్పటు చేసినట్లు పేర్కొన్నారు.

March 21, 2026 / 06:19 AM IST

రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

WGL: ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన యాక్షన్ ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి లక్ష్యం సాధించాలని సూచించారు.

March 21, 2026 / 06:17 AM IST

మానేరులో దూకి యువకుడి ఆత్మహత్య

SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో ఓ యువకుడు దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. మృతుడు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూరు చెందిన దుంపటి వినయ్ కుమార్(30)గా గుర్తించారు. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం వినయ్ శవమై తేడాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

March 21, 2026 / 06:16 AM IST

భారీగా అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

KMM: జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన 39 LPG సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రఘునాథపాలెం మీసేవా కేంద్రంలో 32, 2 హోటళ్లలో 7 సిలిండర్లను పట్టుకొని నిర్వాహకులపై 6A కేసు నమోదు చేశారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం నేరమని, అక్రమ నిల్వలపై తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

March 21, 2026 / 06:16 AM IST

రేడియల్ రోడ్లకు ప్రణాళిక సిద్ధం: HMDA

HYD: ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానానికి 10 కొత్త గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి HMDA ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ 2050లో భాగంగా ఈ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, శివారు ప్రాంతాల అభివృద్ధి, వేగవంతమైన రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.

March 21, 2026 / 06:15 AM IST

ముస్లిం సోదరులకు కలెక్టర్ శుభాకాంక్షలు

NRML: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం భక్తి, నియమ నిష్ఠలు, దానధర్మాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్షలు మనిషిలో సహనం, సేవాభావం పెంపొందిస్తాయని అన్నారు. ఈ పండుగ ప్రతి ఇంట ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వం నింపాలని ఆకాంక్షించారు.

March 21, 2026 / 06:13 AM IST

వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ పుల్లూరి స్వప్న తెలిపారు. రంజాన్ సందర్భంగా శనివారం ప్రభుత్వ సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 23న సోమవారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందని, రైతులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.

March 21, 2026 / 06:11 AM IST

మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట: ఆడే గజేందర్

ADB: రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండలోని మదీనా మస్జిద్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మసీదు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనుల కోసం రూ. 3లక్షల మంజూరు చేసినట్లు గజేందర్ పేర్కొన్నారు.

March 21, 2026 / 06:10 AM IST

మహిళలపై వేధింపులు సహించేది లేదు: PO

ADB: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ PO దామోదర స్వామి తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ సమావేశంలో మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

March 21, 2026 / 06:10 AM IST

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

BHNG: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు రావుల సంతోష, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

March 21, 2026 / 06:09 AM IST

ఈ నెల 30న మహాధర్నాకు పిలుపు: సోమేశ్

ADB: ఈనెల 30న ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్డు నుంచి స్థానిక ITDA కార్యాలయం వరకు నిరుద్యోగులతో భారీ ర్యాలీ చేపడుతున్నట్లు డీఎస్సీ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే డిమాండుతో మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.

March 21, 2026 / 06:08 AM IST

ఇసుక అక్రమ రవాణా చేసిన నిందితుల అరెస్టు

NZB: పొతంగల్ మండలం కల్లూర్ ద్వారా అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను, యాజమానులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. శుక్రవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.

March 21, 2026 / 06:05 AM IST

అనుమతి లేకుండా ఇళ్లు కడితే చర్యలు : ఎమ్మార్వో

WNP: శ్రీరంగాపూర్ మండలంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వరలక్ష్మి హెచ్చరించారు. ఖాళీ ప్లాట్లు, ప్రభుత్వ భూములపై రెవెన్యూ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఏవైనా నిర్మాణాలు చేపట్టాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

March 21, 2026 / 06:02 AM IST

ప్రభుత్వ విప్‌కు ఘన స్వాగతం

PDPL: ఎమ్మెల్యే విజ్జన్న రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన సందర్భంగా శుక్రవారం రాత్రి సుల్తానాబాద్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గజమాలతో సన్మానించి మహిళలు మంగళహారతులతో ఆహ్వానించారు. భారీ బైక్ ర్యాలీతో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు.

March 21, 2026 / 06:02 AM IST

బడ్జెట్‌ కేటాయింపులపై జిల్లా ప్రజల ఆగ్రహం

NLG: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. కీలకమైన సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇతర పథకాలకు సైతం అరకొర నిధులే కేటాయించడంతో విపక్షాలు, ప్రజా సంఘాల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 21, 2026 / 06:01 AM IST