SRPT: అనంతగిరి మండలంలో రెవెన్యూ, పోలీస్ పరిధుల మధ్య సమన్వయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2016లో 19 గ్రామాలతో మండలం ఏర్పడినా, తిమ్మాపురం, తమ్మరబండపాలెం వంటి గ్రామాల్లో గందరగోళం నెలకొంది. రెవెన్యూ పనులకు ఒకే చోట, పోలీస్ సేవల కోసం మరోచోట వెళ్లాల్సి వస్తుంది. ఈ విభజన సమస్యను పరిష్కరించి పాలనను క్రమబద్దీకరించాలని స్థానికులు కోరుతున్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ గోదాము నిర్మాణానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యమని అన్నారు.
కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవీందర్ గౌడ్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కామారెడ్డిని అనారోగ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యాధికారిని కోరారు.
NZB: జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, బీ.ఫార్మా, డీ. ఫార్మా, ఎం. ఫార్మా పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని సూచించారు. వయస్సు 18 నుంచి 35 లోపు అర్హులని వెల్లడించారు.
WNP: రాబోయే రోజుల్లో ప్రజల భూసమస్యల పరిష్కారంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పాత్ర కీలకమని, కాబట్టి నూతన లైసెన్సు సర్వేయర్లు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఇవాళ జిల్లా సర్వేశాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీ సమావేశ మందిరంలో నూతన లైసెన్స్డ్ సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
NGKL: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, న్యాయవాదులు కృష్ణయ్య, ప్రశాంత్, జంగయ్య తదితరులు కూర్చున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయవాదుల రక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
VKB: దోమలో MLA రామ్మోహన్‌రెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో మహిళా డ్వాక్రా వర్క్ షెడ్జ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించినట్లు సర్పంచ్ మాలి శివకుమార్‌రెడ్డి తెలిపారు. మహిళల స్వయం ఉపాధి అభివృద్ధికి ఈ వర్క్ షెడ్జ్ ఉపయోగపడుతుందని, మహిళా సంఘాల కార్యకలాపాలకు తోడ్పడుతుందన్నారు. వార్డు సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
SDPT: రజకులపై జరిగిన దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెజ్జంకి మండల రజక సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు ధీటి రాజు డిమాండ్ చేశారు. వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
MDCL: అవసరంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయాలను సమర్థవంతంగా అందిస్తామని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తెలిపారు. పేద కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యత అని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2 లక్షల 25 వేల విలువైన ఎల్‌వోసీని అందజేశారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రజలకు సకాలంలో అందేలా నాణ్యతతో, గడువులోపే పూర్తి చేయాలని MLA నవీన్ యాదవ్ అన్నారు. మంగళవారం యూసుఫ్ గూడ క్యాంపు కార్యాలయంలో యూసఫ్‌గూడ సర్కిల్ DGM రవీంద్రనాథ్ వర్మ , బోరబండ సర్కిల్ DGM సురేష్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు. ప్రజాసమస్యలపై సమన్వయంతో పనిచేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
BDK: భద్రాచలం లో POW డివిజన్ కమిటీ మహిళ నాయకులు సమావేశమయ్యారు. పాయం రాజమ్మ పాల్గొని మాట్లాడుతూ.. మల్లన్న జాతరలో చాకలి కుటుంబంపై , ఐదు నెలల పసికందు ను కాలితో గొంతు నలిమి చంపడం దారుణమని మండిపడ్డారు. రెడ్డి దొరలు ఇప్పటివరకు హంతకులను పట్టు కోక పోవడం పోలీసులు హంతకుల కే కొమ్ములు కాయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య సిగ్గుచేటు అన్నారు.
MDK: కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి సుమలతకు రూ.53,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ (CMRF) చెక్కును జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఈ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఆమె తెలిపారు. వెంకటేశం, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని నజీరాబాద్ తండాలో పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య సందర్శించారు. తండాలో అండర్ డ్రైనేజ్, వీధి దీపాలు, సీసీ రోడ్లు, ఎక్కడ లేవో ఆ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండాలో ప్రతి ఇంటి వద్ద తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి వైస్ ఛైర్మన్ హనుమంతు పాల్గొన్నారు.
WNP: పెబ్బేర్ మున్సిపల్ కేంద్రంలో మొబైల్ షాప్ దగ్ధం ఘలనలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని మంగళవారం స్థానిక మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ రావు తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, షాప్ నిర్వాహకుడు మహేశ్, వడ్డే ఈశ్వర్ తదితరులు పంచనామాకు హాజరై బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.