BHPL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలు నేపథ్యంలో ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
BHPL: జిల్లా కేంద్రంలోని CR నగర్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
BDK: జిల్లా బీజేపీ గిరిజన మోర్చా బాధ్యులు తంబల్ల రవి ఉరుములబండ గ్రామంలో ఇవాళ పర్యటించి ఆదివాసి కుటుంబాలను పరామర్శించారు. ఆదివాసీలు గత 40 సంవత్సరాలుగా ఇక్కడ భూములను సాగు చేసుకుంటూ ఇక్కడే జీవిస్తుంటే అటవిశాఖ అధికారులు దౌర్జన్యంగా వారిపై దాడులు చేస్తున్నారన్నారు. YSR, KCR ప్రభుత్వంలో భూమి పట్టాలు పొంది ఉన్న దాడులు చేస్తున్నారని అన్నారు.
SRPT: సూర్యాపేట పట్టణంలో వైద్య సేవలు మరింత చేరువయ్యాయి. పట్టణంలోని శ్రీ చిన్నారి పిల్లల హాస్పిటల్‌ను ఈరోజు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 44వ వార్డు కౌన్సిలర్ గుణగంటి హేమ తదితరులు పాల్గొన్నారు.
MHBD: కురవి మండల కేంద్రంలోని వీరభద్రస్వామి వారి ఆలయాన్ని సినీనటి రాగిణి సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సినీనటికీ స్థానికులు ఘన స్వాగతం పలికారు. వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని, స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.
NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదర మండలంలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యులతో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాలయం ఆవరణలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం నిర్మాణంపై చర్చించారు. ఎంతో చరిత్ర కలిగిన మద్దిమడుగు దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
KMM: కామేపల్లి మండలం పండితాపురం వారాంతపు సంత వేలం ఈనెల 13న ఉదయం 11 గంటలకు కృష్ణప్రసాద్ పశువుల బహిరంగ వేలం సంత లో జరగనుంది. ఈ విషయన్ని కొమ్మినేపల్లి సర్పంచ్ ధరావత్ అనురాధ, కార్యదర్శి శంకర్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉండే ఈ వేలంలో, పీసా చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్టీలకు మాత్రమే అర్హత ఉంటుందని వారు వెల్లడించారు.
NLG: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026 పాలిసెట్ దరఖాస్తుదారులకు ఉచిత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ విద్యార్థులకు తోడ్పాటునందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
MNCL: గత కమిషనర్ కాలంలోని హరితహారం చెక్కు చెల్లింపుల విషయమై కమిషనర్ చాంబర్‌లో చర్చ జరగగా చెన్నూర్ కాంగ్రెస్ నాయకుడు సుద్దమల్ల సుశీల్ తనను దూషించాడని కమిషనర్ మురళీకృష్ణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల నామినేషన్ డబ్బులు స్వాహా చేద్దామని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.
MNCL: గత కమిషనర్ కాలంలోని హరితహారం చెక్కు చెల్లింపుల విషయమై కమిషనర్ చాంబర్‌లో చర్చ జరగగా చెన్నూర్ కాంగ్రెస్ నాయకుడు సుద్దమల్ల సుశీల్ తనను దూషించాడని కమిషనర్ మురళీకృష్ణ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల నామినేషన్ డబ్బులు స్వాహా చేద్దామని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.
NLG: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు దేవరకొండ మీనాక్షి హోటల్ డిండి చౌరస్తా వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కమీషనర్ పూర్ణ చందర్, చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మొహమ్మద్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రజా పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,330 ధర పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.21,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ.35,500 పలికింది. తేజ మిర్చి ధర రూ.19,200, ఎల్లో మిర్చికి రూ.21వేల ధర వచ్చినట్లు అధికారులు తెలిపారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
MNCL: సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ దారులకు వెంటనే డబ్బులు చెల్లించాలని బాధితుడు గజెల్లి వెంకటయ్య శుక్రవారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులను ఏజెంట్ల మాయ మాటలు నమ్మి సహారాలో డిపాజిట్ చేశారని తెలిపారు.
BHPL: రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని శుక్రవారం మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో BRS జిల్లా నాయకులు ఉన్నారు.