MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సీఎం కప్ 2025 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడచిన పది సంవత్సరాల కాలం క్రీడలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.
MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు, రోగులకు డాక్టర్లు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిని పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు.
NRML: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తికావస్తున్న ఇళ్ల పట్టాలు ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తయి శిథిలావస్థ దశకు చేరుతున్న అధికారులు స్పందించడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం తమ ఆవేదన వ్యక్తం చేశారు.
VKB: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నమోదైన కేసులో భాగంగా హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ఏడు మంది అనుచరులతో పాటు తాండూర్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈమేరకు పట్టణ సీఐ ముందు షూరిటీలు సమర్పించిన సమయంలో పైలెట్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్ద హల్‌చల్ చేశారు.
SDPT: కుమ్మేర మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు.
WNP: వనపర్తి పట్టణ పరిధిలోని మర్రికుంట గ్రామ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కర్నూల్ వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో చెత్తాచెదారం, మురుగు నీరు పేరుకుపోవడంతో పందుల సంచారం, దోమల బెడద ఎక్కువైందని పట్టణ ప్రజలు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
NZB: విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అదేవిధంగా సౌమ్య తమ్ముడు గాజుల శ్రవణ్‌కు ఎక్సైజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా సోమవారం అందించారు.
హైదరాబాద్ హెచ్‌ఐటీఎక్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ లవణం కళ్యాణ్ వరప్రసాద్ అవార్డు అందుకున్నారు. యాక్ట్ నౌ వాలంటరీ ఆర్గనైజేషన్ ఛైర్మన్ డాక్టర్ కే.ఎస్ మూర్తి చేతుల మీదుగా డాక్టర్ ఒటో- లారిన్జాలజీ హెల్త్‌కేర్‌లో ఉత్తమమైన సేవలను అందించినందుకుగాను ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
NRPT: మరికల్ మండల కేంద్రం మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షులు పెంట మీద నారాయణ కుటుంబాన్ని సోమవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరమర్శించారు. నారాయణ మృతి కాంగ్రెస్ పార్టీకి, మత్స్య సహకార సంఘానికి తీరని లోటు అన్నారు. నారాయణ సేవలను కొనియాడారు. సర్పంచ్ చెన్నయ్య, పాలమూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సూర్య మోహన్ రెడ్డి ఉన్నారు.
MDK: అల్లాదుర్గం మండలంలోని గొల్లకుంటతండా గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం నిరుపయోగంగా మారింది. రోడ్డుకు ఆనుకొని క్రీడా ప్రాంగణం అనే పేరు గల బోర్డును తగిలించారు. ఓ వ్యవసాయ చేనులో ఏర్పాటు చేయడంతో ఆ రైతు చేను దున్నుకోవడం వల్ల యువకులు క్రీడలకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాన్ని వినియోగంలోకి తీసుకురావలన్నారు.
HYD: కొంపల్లి సర్కిల్-56లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ఇంటింటికీ చెత్త సేకరణ ప్రత్యామ్నాయ రోజుల్లో జరుగుతున్నట్లు గుర్తించి, ఇకపై ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన్ తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఏటీ వాహనాలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి అవగాహన కల్పించడంతో పాటు పునరావృతమైతే జరిమానా విధించాలన్నారు.
KNR: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హౌస్ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చొప్పదండిలో బీజేపీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ తోపులాట జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన సాగుతోందని నినాదాలు చేశారు.
MBNR: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో అనిల్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
NLG: ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు.
NGKL: ఊర్కొండ మండలం జగబోయిన్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి రూ.5,000 నగదును అందజేశారు. భవిష్యత్తులో బాధిత కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని ధ్యాప నిఖిల్ రెడ్డి భరోసా ఇచ్చారు.