మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామని కొన్ని సంఘటనలు చూస్తే సందేహం వస్తుంటుంది. ఇంకా కులాలు, మతాలు అని పట్టుకు కూర్చుంటే నాగరిక సమాజం వైపు ఎప్పుడూ అడుగులు వేస్తాం. ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడతాం? తాజాగా ఓ యువతి దళితుడిని వివాహం చేసుకుందనే నెపంతో ఆ అమ్మాయిని, ఆమె కుటుంబసభ్యులను కులం నుంచి బహిష్కరించారు. అయితే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో కేసు నమోదైంది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో […]
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్లో ఉన్న కారు లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రికల్ కారు లో నుంచి మంటలు వ్యాపించాయి. ఒక కారు నుంచి మరో నాలుగు కార్లకు వ్యాపించినట్లు మంటలు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, అబిడ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. జీ...
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనసభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు. శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై శనివారం ముఖ్యమంత్ర...
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాపైందని ప్రజాశాంతి అధ్యక్షడు కేఏ పాల్ తెలిపారు. బీర్, బిర్యాని ఇచ్చినా జనం మాత్రం సభకు రాలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ గద్దర్ కు రూ.150 కోట్లిచ్చి మునోగోడు ఉప ఎన్నికలో పోటీ చేయకుండా చేశారని ఆరోపించారు. పాలనాపరంగా కేంద్రంలోప్రదాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు దోచుకున్న మోడీ, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చ...
హాత్ సే హాత్ జోడో యాత్ర ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భద్రాచలం రాముల వారి సన్నిధి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీభవన్ లో శనివారం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ వ్యవహారల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఇతర సీనియర్ నాయకులతో హాత్ సే హాత్ జోడో యాత్రపై చర్చించారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభిం...
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా నలుగురు మృతి చెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలిం...
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన 2023 ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన విజయవంతమైందని కేటీఆర్ తన ట్వీట్‌లో తెలిపారు. 4 రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలు జరిగినట్లు మంత్రి వెల్లడించారు. దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ...
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్దరాత్రి ప్రారంభం కానుంది. ప్రతి యేటా ఫుష్యమాసం అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహాపూజలతో జాతర ప్రారంభమవుతుంది. కాగా, ఈ వేడుకకు మెస్రం వంశీయులతో పాటు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలోని కలమడుగుకు కాలినడకన వెళ్లి గోదావరి పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఈ జలాలతో అభిషేకం చేసిన అ...
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజరయ్యారు. ఫిబ్రవరి 3 లేదా 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా. వాస్తవానికి రాష్ట్ర బడ్జె...
తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయని అనుకుంటున్న సమయంలోనే మళ్లీ విబేధాలు మొదలయ్యాయి. నిన్న అంతా ఒకే అనుకుంటే తెల్లారే గాంధీభవన్ లో వివాదం రాజుకుంది. పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న కోమటిరెడ్డి లాంటి వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ ఓటమికి కోమటిరెడ్డి కారణమని...
దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...
ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణ...
విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...
తెలంగాణ ఆర్టీసీ క్రమంగా గాడీన పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రయాణికులకు రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ రద్దీని తట్టుకుని పకడ్బందీగా సేవలు అందించి ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంది. సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఆర్టీసీ ప్రైవేటు కార్యక్రమాలకు కూడా బస్సులను అద...
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే వచ్చే నెలలో రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివ...