SRPT: సహకార సంఘాల ద్వారానే రైతులకు నేరుగా యూరియా సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యాప్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్రం ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని, విద్యుత్ సవరణ చట్టం కార్పొరేట్లకు మేలు చేసేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.
WNP: మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.లక్ష CMRF చెక్కును దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
NRML: తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా తుర్క కాషా ముస్లిం సమాజానికి చెందిన రాయి కోత పనులు చేసే అర్హులకు రూ.60 వేలును 100% సబ్సిడీతో అందించనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 1లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలని, మరిన్ని వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ADB: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నాణ్యతతో ఇంటి నిర్మాణం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రాథోడ్ భిక్కు అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని PVTGలకు మంజూరైన ఇళ్లను ఆయన పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ అనేక పథకాలు కల్పిస్తుందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసి లబ్ది పొందాలన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం, గుర్తురు, మడిపల్లి, సోమారం కుంట తండా గ్రామాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే అక్రమ ఇసుక రవాణా నడుస్తుందని మండలంలోని ప్రజలు, పలువురు పలు రకాలుగా ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
NRML: జిల్లా మిషన్ భగీరథ డివిజన్ హెల్పర్స్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా విజయసాగర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం మండల కమిటీలను ప్రకటించారు. సోన్ మండలానికి వెలుమల శ్రీను, సారంగాపూర్ పిట్ల శీను, దిలావర్పూర్ రాజు, నర్సాపూర్ జి మండలానికి లావణ్యలు ఎంపికయ్యారు.
SRCL: ఇంటర్ వార్షిక పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు 163 BNSS (సెక్షన్ 144) అమల్లో ఉంటుందని సిరిసిల్ల DSP నాగేంద్రచారి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
RR: కేశంపేట మండలం కాకునూర్ గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి సన్నిధిలో బండలాగుడు పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. కేశంపేట మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
SDPT: హుస్నాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో ఎస్సై లక్ష్మారెడ్డి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
NZB: బాల్య వివాహాలను ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల పరిరక్షణ అధికారి నాగేరి బాబు హెచ్చరించారు. శుక్రవారం రుద్రూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేస్తే తల్లిదండ్రులతో పాటు సహకరించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
PDPL: మంథని మండల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా సమాచారంతో గుట్టు చప్పుడు కాకుండా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఓయూలో జరిగిన సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్‌లో పాల్గొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహించిన ఈ సమావేశం “Creating AI & Quantum Enabled Higher Educational Institutions” అంశంపై జరిగింది. తెలంగాణ గవర్నర్‌తో పాటు సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్లు పాల్గొన్నారు.
SRD: భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో సంత్ శ్రీ గురు రవిదాస్ 649వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించుకుని సంత్ రవిదాస్ విగ్రహానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
PDPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు సాక్సెస్ ప్రాజెక్ట్ LLP కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 24న PDPL జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి రాజశేఖర్ తెలిపారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 50, మార్కెటింగ్ మేనేజర్ 1 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 18-36 సం.ల మధ్య గల అభ్యర్థులు ఈనెల 24న ఉదయం 11 గంటలకు హాజరు కావాలన్నారు.