MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 2,082 క్వింటాళ్ల వేరుశనగ చేరింది. ఈ సందర్భంగా గరిష్ట ధర క్వింటాకు రూ.10,269గా నమోదైంది. కనిష్ట ధర రూ.4,500 కాగా, సాధారణ ధర రూ.9,169గా ఉంది. గతంలో క్వింటాకు రూ.12,000కు పైగా ధర పలికిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
SRD: మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌లో అవమానం జరగకుండా ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చిన బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు.
MBNR: చిన్నచింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR) అందజేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్, నాయకుల సమక్షంలో ఈ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
NLG: చిట్యాలలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ‘సామాజిక న్యాయ దినోత్సవం’ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ‘మాక్ కోర్టు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు న్యాయమూర్తులు, లాయర్ల పాత్రల్లో అభినయించి, న్యాయ ప్రక్రియపై అవగాహన కల్పించేలా మెప్పించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
WNP: హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కరీంనగర్‌కు చెందిన గణేష్ అనే బాలుడు తప్పిపోయి మదనాపురం మండలం బౌసింగ్ తండా వాసుల వెంట వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి వివరాలు సేకరించిన అనంతరం పోలీసుల సహకారంతో సురక్షితంగా సఖీ కేంద్రానికి తరలించారు.
MLG: ప్రజా భవన్లో “Goddess of Folk–Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. బుక్‌ను రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. జాతర అరుదైన ఫోటోలతో ఆకర్షణగా మేడారం కాఫీ టేబుల్ బుక్ ఉందని మంత్రి సీతక్క అన్నారు.
NZB: పోతంగల్ మండలం గన్నారం, లింగాపూర్ గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 65 మందికి పరీక్షలు చేయగా, 14మందికి మోతెబిందు ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.
BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో శుక్రవారం నూతన పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయమన్నారు.
భద్రాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఈరోజు సందర్శించారు. గ్రంథాలయ పరిసరాలు, పుస్తకాలు, అందుబాటులో ఉన్న వనరులు, పని వేళలు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంచి గ్రంథాలయం మనకు అందుబాటులో ఉండటం అదృష్టకరమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
WNP: ఏఐసీసీ అధ్యక్షులు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఇంద్ర భవన్‌లో ఖర్గేకు పూల బొకే ఇచ్చి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని ఖర్గే అభినందించినట్లు చిన్నారెడ్డి తెలిపారు.
NGKL: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ఐడీఓసీలో కల్వకుర్తి డివిజన్‌కు చెందిన 116 మంది నూతన సర్పంచులకు రెండో విడత శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా ప్రభుత్వం మహిళా శక్తికి ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు.
KNR: జనహితమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తే ప్రజలు మరింత పురోభివృద్ధి సాధిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో శుక్రవారం తిమ్మాపూర్ మండలానికి చెందిన 57 మందికి సీఎంఆర్ఎఫ్, 67 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
VKB: స్మశాన వాటిక పనులు నాణ్యతతో చేపట్టి త్వరగా పూర్తిచేయాలని కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ మున్సిపల్లోని రెండో వార్డులో కొనసాగుతున్న శ్మశానవాటి పనులను కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్మశానవాటికలు మంచినీటి వసతితో పాటు అన్ని సౌకర్యాలు తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
WGL: నిబంధనల మేరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించాలని వరంగల్ డీఐఈవో శ్రీధర్ సుమన్ అన్నారు. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఛీఫ్ సూపరింటెండెంట్లు, ఇతరులకు ప్రత్యేక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 26 థియరీ పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడుతాయని DIEO తెలిపారు.
మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామంలో ఓ టీవీ ఛానల్ చైర్మన్ వెన్నం విజయకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సవిందాన్ కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డిల తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్యాల గ్రామానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.