GDWL: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే జరిగిందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా.ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ వ్యవహారాల్లో వ్యక్తిగత నిర్ణయాలకు చోటు లేదని ఆయన తెలిపారు. ఎన్నికలు ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు సరికాదని హితవు పలికారు.
VKB: పర్యాటక ప్రాంతమైన అనంతగిరి క్షేత్రానికి వస్తున్న సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యేకంగా రెండు సఫారీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటకులు ఈ వాహనాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
PDPL: ఓదెల మండలంలోని గుండ్లపల్లి, సుల్తానాబాద్ మండలం కణుకుల గ్రామాల్లో ఏర్పాటు చేసిన హాకా రైతు సేవా కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సేవా కేంద్రాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను సంబంధిత కాంగ్రెస్ నాయకులు నిర్వాహకులు సన్మానించారు.
MDK: రైతులు పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయ అధికారి స్రవంతి సూచించారు. శుక్రవారం మండలంలోని కొనాయిపల్లిలో రైతు తప్పేట సాయిబాబా వెదజల్లే పద్ధతిలో వేసిన వారి నాటును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులు విభిన్న పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. గంజాయి మత్తులో ఓ కిరాతక కొడుకు కన్నతండ్రినే కడతేర్చాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్ర సత్తయ్య(60), తన కుమారుడు బాలకృష్ణ (34) మధ్య కుటుంబ విషయాల్లో తగాదా మొదలైంది.ఆగ్రహంతో మత్తులో ఉన్న బాలకృష్ణ తండ్రిని కర్రతో కొట్టడంతో సత్తయ్య మృతి చెందాడు.
HYD: గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న HYDలో ‘పార్కింగ్’ సమస్య ఇప్పుడు సగటు జీవికి శాపంగా మారింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులు లేవు. ఉన్నచోట అక్రమ వసూళ్లు దడ పుట్టిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు ప్రైవేట్ యాజమాన్యాల మధ్య సమన్వయ లోపం సామాన్యుడికి శాపంగా మారుతోంది. ఈ అక్రమాలను అరికట్టేందుకు GHMC స్పెషల్ డ్రైవ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
SRD: కాంప్లెక్స్ సమావేశాలు విద్యార్థుల ప్రగతికి నాంది కావాలని కొండాపూర్ ఎంఈవో దశరథ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తొగర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిరి పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభమైన రీతిలో బోధించాలని సూచించారు. గుణాత్మక విద్యను అందించాలన్నారు.
వనపర్తి జిల్లా నర్సింగయ్య పల్లి డిగ్రీ కాలేజ్ వద్ద శుక్రవారం ఉదయం రెండు బైకులు ఢీ కొని ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని సరైన సమయంలో అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో గతంలో గోపాల్పేట ఎస్సైగా విధులు నిర్వహించిన నరేష్ తన బైక్‌పై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు శభాష్ పోలీస్ అని కొనియాడారు.
ASF: పెంచికల్ పేట్ మండలం బొంబాయి గూడ గ్రామంలో నూతనంగా నిర్మితమైన అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి MLA హరీష్ బాబు శుక్రవారం హాజరయ్యారు. వేద పండితులు బాచంపల్లి కమలాకర్ శర్మ ఆధ్వర్యంలోప్రతిష్టాపన జరిగింది. యాగశాలను సందర్శించిన MLAకు వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు.
SDPT: హుస్నాబాద్‌లో ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నిర్వాహకుల ప్రకారం దాదాపు 200 మంది సభ్యులు ఇక్కడ ఆరాధనలు నిర్వహిస్తున్నారు. స్థల వివాదంపై గతంలో కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ధ్వంసం చేసిన మందిరాన్ని మళ్లీ కూల్చివేశారని వాపోయి, బాధ్యులను శిక్షించాలన్నారు.
KMM: మధిర మండలంలోని జాలిముడి మల్లారం వద్ద మధిర డిపోకు చెందిన ఒక ఆర్టీసీ బస్సు ఆపమని సంకేతాలు ఇచ్చినా ఆగకపోవడం స్థానికుల్లో ఆవేదన కలిగిస్తుందని స్థానికులు శుక్రవారం తెలిపారు. వయసు మళ్లిన వృద్ధులు బస్సు ఎక్కేందుకు చేతులు ఊపుతూ ఆపమని సూచించినప్పటికీ, బస్సు కొంత దూరం వెళ్లిపోయిందని అక్కడి ప్రజలు తెలిపారు.
JN: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు రానున్నారు. నూతన ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు, మహిళా నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ కోరారు.
MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, విభాగాల్లోని ఉద్యోగుల వివరాలు ఆన్‌లైన్లో నమోదు చేయాలని GM ఎం.శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, బ్లడ్ గ్రూపు వంటి వివరాలు గనులు, విభాగాలపై సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. లేకపోతే వీరికి మెడికల్ రిఫరెన్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
PDPL: రామగుండం మున్సిపల్ పరిధిలోని 45వ డివిజన్లో పారిశుధ్యంపై తగు చర్యలు తీసుకోవాలని 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయనను సంబంధిత డివిజన్ పరిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆయన సన్మానించి డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని సూచించారు.
NZB: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈ నెల 19 నుంచి 23 వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాకు చెందిన ప్రతిభా కనబరిచిన క్రీడాకారులు ఎంపిక చేసి పంపడం జరిగింది. ఈ జట్టుకు కోచ్‌గా శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ పాఠశాలలో PET గా నిర్వహిస్తున్నారు.