ఉస్మానియా యూనివర్సిటీ (OU) మరోసారి తెలంగాణ (Telangana) ఉద్యమ రూపాన్ని తలపించింది. విద్యార్దుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కాలేజ్ (Arts College) దద్దరిల్లింది. అరెస్టులతో ఉద్యమాల గడ్డ ఓయు (OU) అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు విద్యార్ది నాయకులు హెచ్చరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నాడనే నేపధ్యంలో పలువురు బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు అడ్డుకొని తీరుతాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ (OU) మరోసారి తెలంగాణ (Telangana) ఉద్యమ రూపాన్ని తలపించింది. విద్యార్దుల నిరసనలు, అరెస్టులతో ఆర్ట్స్ కాలేజ్ (Arts College) దద్దరిల్లింది. అరెస్టులతో ఉద్యమాల గడ్డ ఓయు (OU) అనే విషయం గుర్తుంచుకోవాలని పలువురు విద్యార్ది నాయకులు హెచ్చరించారు. మరో వైపు రేవంత్ రెడ్డి ఓయూకు వస్తున్నాడనే నేపధ్యంలో పలువురు బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు అడ్డుకొని తీరుతాం అంటూ నిరసనలు వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పలు విద్యార్ది నిరుద్యోగ సంఘాలు శుక్రవారం విద్యార్ది నిరుద్యోగ మార్చ్,(Unemployment march) దీక్ష, ధర్నాలకు పిలుపునిచ్చాయి. ఉదయం ఐదు గంటల నుండే హాస్టళ్లలో ఉన్న పలువురు విద్యార్థి నాయకులను ఓయూ పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించారు. యాభై రెండు మందిని అరెస్టు చేసి ఓయూ , అంబర్ పేట(Amber Peta), లాలాగూడ స్టేషన్ లకు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్ది సంఘాల ఆధ్వర్యంలో దీక్షకు దిగడంతో వెంటనే వారిని పోలీసులు(police) అరెస్ట్ చేశారు.
కేసీఆర్ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కవిత లిక్కర్ స్కాం చేస్తే, కేటీఆర్ పేపర్ స్కాం చేశాడని వారు ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతూ కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. లీకేజీ పై సీబీఐ (CBI) తో సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. లీకేజీ లో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ (Paper leakage) ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓయూ విద్యార్థి నాయకుల్లో ఒకరు పెట్రోల్ పోసుకోగా, ఇద్దరు పోసుకోడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఓయూ లో అడుగు పెడితే తరిమికొట్టడం ఖాయం అంటూ పలువురి బీఆర్ఎస్వీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనానికి యత్నించారు. అడ్డుకున్న పోలీసులు (police) వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.