»Dil Raju Political Entry Congress Party This The Party
Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..ఈ పార్టీ నుంచే?
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు(Dil Raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ సోషల్ మీడియా(social media)లో చర్చ మొదలైంది. అయితే ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) హత్ సే హత్ జోడోయాత్ర పేరుతో నిజామాబాద్ జిల్లాలో(nizamabad district) పర్యటించారు. ఆ క్రమంలో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని దిల్ రాజు ఆహ్వానించారు. దీంతో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్ రాక సందర్భంగా మోపాల్ మండలం దిల్రాజు సొంత గ్రామమైన నర్సింహపల్లిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆయనను పిలిపించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే ఇదే పొలిటికల్ ఎంట్రిపై గతంలో సైతం వార్తలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, వ్యాపారవేత్తగా ఉన్న దిల్ రాజు(Dil Raju) త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నట్లు అతని పుట్టినరోజు సందర్భంగా ప్రచారం జరిగింది. సమాజానికి తిరిగి ఇవ్వడం, సామాజిక సమస్యలు, సహాయం అవసరం, సామాజిక సేవ వంటి అంశాలపై దిల్ రాజు అప్పుడు మాట్లాడిన క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ జరిగింది. ఆ క్రమంలోనే తాను విద్య, ఆరోగ్యం అనే రెండు కీలక అంశాలపై ఆసక్తి కూడా చూపారని తెలిసింది. కానీ అవి అమల్లోకి రాలేదు.
ప్రస్తుతం దిల్ రాజు రాజకీయాల్లోకి వస్తాడని(political entry) పుకార్లు ఉన్నప్పటికీ, వాటిని ఇంకా ఆయన ధృవీకరించలేదు. తనకు అనేక రాజకీయ పార్టీల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నందున తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వేరొక ప్రశ్నకు సమాధానంగా తాను సినిమా డైరెక్టర్ని కావాలని ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పాడు.
ఇటీవలే “బలగం”(balagam movie) చిత్రానికి ప్రశంసలు అందుకున్న దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. తాను ఈ సినిమా కథను నమ్ముతానని, చిత్రీకరణ సమయంలో దాని సారాంశాన్ని ఉంచడంపై చాలా శ్రద్ధ పెడతానని చెప్పాడు. ఆయనకు తెలంగాణ గ్రామాలతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా హాస్యనటుడు వేణును ఈ చిత్రానికి సారథ్యం వహించడానికి ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే అతను తన పిల్లలతో కలిసి స్థాపించిన ఈ కొత్త నిర్మాణ సంస్థ వారికి పెద్ద ప్రోత్సాహాన్ని అందించిందని తెలిపారు. మంచి రాబడితోపాటు మంచి గుర్తింపు కూడా వచ్చిందని తెలిపారు.