VKB: వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 85 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. వచ్చిన వినతులను పెండింగ్లో పెట్టకుండా అధికారులు సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.