»Notices To 42 Others In Question Paper Leakage Case
TSPSC : ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో 42 మందికి నోటీసులు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తొన్నారు. రిసెంట్ గా టీఎస్ పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తొన్నారు. రిసెంట్ గా టీఎస్ పీఎస్సీలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సిట్(Sit) పలువురు ఉద్యోగులు, అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కమిషన్‌లో పనిచేస్తోన్న 10 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. దర్యాప్తులో భాగంగా వారందరికి నోటీసులు పంపింది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మీ (Shankara laxmi) పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శంకరలక్ష్మీని ఓ సారి విచారించిన సిట్.. రేపు మరోసారి ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేయనుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితురాలు రేణుకతో టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. అభ్యర్థులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధం అయ్యింది. అలాగే నిందితుడు రాజశేఖర్ (Rajasekhar)స్నేహితుడు రమేష్ పాత్రపై మరోసారి సిట్ అధికారులు విచారణ చేయనున్నారు.
పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం(Cybercrime Technical Team). రేణుక, నీలేష్, గోపాల్ మధ్య 14 లక్షల నగదు ఆర్థిక లావాదేవీలు జరగగా ఆ అంశాల మీద రాజశేఖర్ కాంటాక్ట్స్ & వాట్స్ అప్ చాటింగ్ వివరాలపై సిట్ అరా తీసింది. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ ఇంకెవరికి అయిన ప్రశ్నాపత్రం లీక్ చేశాడా ? అని సురేష్ ను సిట్ విచారించినట్టు తెలుస్తంది. సురేష్ & రాజ్ శేఖర్ లావాదేవీలు (transactions) వారి వాట్స్ అప్ & కాల్ డేటా పై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్‌తో సంబంధాలున్న వారందరినీ ప్రశ్నిస్తున్న సిట్ ఇప్పటికే శంకర్‌లక్ష్మిని రెండుసార్లు పిలిచి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్తో (Technical Dept )సంబంధం ఉన్నవారందరినీ ప్రశ్నిస్తున్న సిట్ రాజశేఖర్, సురేష్ మధ్య సంబంధాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సురేష్ ఎంతమందికి పేపర్ ఇచ్చారన్నదానిపై సిట్ ఆరా తీస్తోంది.