Komatireddy venkat reddy: నల్గొండ నుంచి పోటీ చేస్తా..నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా
నా టికెట్ నేనే ప్రకటించుకుంటున్నా..నల్గొండ(nalgonda) నుంచే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి సమక్షంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komatireddy venkat reddy) ప్రకటించుకున్నాడు.
తాను వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy venkat reddy) ప్రకటించారు. తన టికెట్ తానే ప్రకటించుకుంటున్నానని ఆయన చెప్పడం విశేషం. రేవంత్ రెడ్డి శుక్రవారం నల్గొండకు వచ్చారు. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడకు రావడం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు, లక్షణంగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లను జగన్మోహన్ రెడ్డికి వదిలేశారు. 1000 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్(KCR) నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహించారు.
నల్లగొండ(nalgonda) నిరుద్యోగ నిరసన సభలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్(KCR) పాలన పై నిప్పులు చెరిగారు. శ్రీశైలం సురంగం ప్రాజెక్టును ఉదయంసముద్రం ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామని ఎన్నికలలో చెప్పి 80 శాతం పనులు పూర్తయిన ఆ ప్రాజెక్టులను మూలన పడేశారన్నారు.
దళితుడిని ముఖ్యమంత్రి కాకుంటే మేడ మీద తల ఉండదని, డబ్బా ఇండ్ల బదులు డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి అని చెప్పి తొలిసారి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రెండోసారి ఎన్నికల ముందు దళిత బంధు(dalitha bandhu) పేరుతో మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు.
జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని.. 2014లో ఒకసారి కేసీఆర్ మాటలకు మోసపోయామని వివరించారు. 2018లో రైతుబంధు పథకం తీసుకొచ్చి రెండోసారి కేసీఆర్ మోసం చేశారు. మూడోసారి మోసపోవద్దన్నారు. దళిత బందు నగదు బదిలీలో అవినీతికి పాల్పడిన చిట్టా మీ దగ్గర ఉంటే ఆ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి. తినడానికి తిండి లేని మంత్రి జగదీశ్ రెడ్డికి 80 ఎకరాల ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని వెల్లడించారు.
సీనియర్ నాయకుడైన నేను, మా ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటికి అద్దె ఇళ్లలోనే ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లిన నకిరేకల్ ఎమ్మెల్యే సైతం అక్రమ ఆస్తులు సంపాదించాడు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం నోటిఫికేషన్లో ఇచ్చినట్లు కనిపించడం లేదని ఆగ్రహించారు.