Kavitha: నిజామాబాద్ లో ఐటీ హబ్: అరెస్ట్ పై ఏమన్నారంటే
తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.
త్వరలో నిజామాబాద్ ఐటీ హబ్ ను ప్రారంభిస్తామని, దీనిని మంత్రి కేటిఅర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిన్న ఐటీ హబ్ నిజామాబాద్ వెబ్ సైట్ ను ప్రారంభించారు కవిత. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇక్కడ పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఆరంభం వంటిది అన్నారు. 50 కోట్ల రూపాయలతో ఐటీ హబ్ నిర్మిస్తున్నామని, దీని ద్వారా 750 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇప్పటికే పలు కంపెనీలతో కుదిరాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఐటీ హబ్ ను మరింత విస్తరిస్తామని, అవసరం అయితే పక్కన ఉన్న స్థలాన్ని తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
అంతకుముందు ఆమె మాట్లాడుతూ.. తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు దర్యాప్తు సంస్థలు ఎందుకు అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలను బిజెపి ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం అన్నారు. ఈ మాటల ద్వారా బిజెపి, దర్యాప్తు సంస్థల మ్యా ఫిక్సింగ్ మరోసారి తేలిపోయింది అన్నారు.