»Mla Raja Singh Supports Bandi Sanjay Demand To Mp Arvind
MLA Raja Singh: బండి సంజయ్ మాటల్లో తప్పులేదు, అరవింద్ గారూ.. వెనక్కి తీసుకోండి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు. బండి మాటల్లో ఎలాంటి తప్పు లేదని, ఈ వ్యాఖ్యలను తప్పుపట్టినందుకు గాను నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు (Nizamabad Lok Sabha MP) ధర్మపురి అరవింద్ (dharmapuri arvind) ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అరవింద్ చెప్పినట్లుగా సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అని, ఏది మాట్లాడాలి… ఏది మాట్లాడకూడదనే విజ్ఞానం ఆయనకు ఉందని చెప్పారు. అరవింద్ కు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేరుగా అతనితోనే మాట్లాడాలని, కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం సరికాదని సూచించారు. రాష్ట్రంలో పార్టీకి మంచి స్పందన లభిస్తోందని గుర్తు చేశారు. వచ్చేది ఎట్టి పరిస్థితుల్లోను బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కాబట్టి పార్టీని ఇబ్బందులకు గురి చేయకుండా అరవింద్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.
‘అరవింద్ కు ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా సంజయ్ తో మాట్లాడాలి. ఇద్దరు కూడా పార్లమెంటు సభ్యులు. తరుచూ ఢిల్లీలో కలుస్తుంటారు. కాబట్టి కలిసి మాట్లాడితే సరిపోయేది’ అన్నారు. కానీ ఇలా మీడియాకు ఎక్కడం సరికాదని, వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ఒకసారి ఆలోచన చేసుకోవాలని కోరారు. రాజాసింగ్ ఇంకా మాట్లాడుతూ… 2026 నాటికి భారత్ ను హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మీడియా ప్రశ్నించగా కొట్టకుంటే ముద్దు పెట్టుకుంటారా.. అనే తెలుగు సామెతకు అనుగుణంగా అరెస్ట్ చేయకుంటే ముద్దు పెట్టుకుంటారా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, సొంత పార్టీ నేతలు ధర్మపురి అరవింద్ కూడా సమర్థించడం లేదని చెప్పారు. ఇది పార్టీలో విభజనకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వంటి పలువురు నేతలు బండి సంజయ్ కు అండగా నిలుస్తున్నారు.