»Minister Jagadeesh Reddy On Ed Summons To K Kavitha
Delhi excise policy case: కవితకు నోటీసులపై జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే..
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు.
భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు. బీజేపీ (BJP) దురాగతాలను బయట పెడుతున్న తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పైన కుట్రలో భాగంగానే కవితకు నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వం (central government)… దర్యాఫ్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తోందన్నారు. మోడీ (Prime Minister of India Narendra Modi) దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ (BJP) అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో తాము బట్టబయలు చేస్తామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇక్కడ బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టె కుట్రలో భాగగానే నోటీసులు వచ్చాయని, అదే కోణంలో అరెస్టులు కూడా జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని, ఇలాంటి పప్పులు కేసీఆర్ ముందు ఉడకవన్నారు. బీఆర్ఎస్ను నిలువరించగలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వమే అవుతుందని దుయ్యబట్టారు.
కవితకు (Kalvakuntla Kavitha) నోటీసులు బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్టగా చెప్పారు. దేశ చరిత్రలోనే ఎన్నడు లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ, అణిచివేత ధోరణితో ముందుకు సాగుతోందన్నారు. ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని, దాని ఆధారంగా ఓ కథను అల్లి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును తీసుకు వచ్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి కేసులు తమను ఏమీ చేయలేవన్నారు. 2001లో ఉద్యమంలోకి వచ్చినప్పుడే కేసీఆర్ ఇలాంటి అంశాలను స్పష్టంగా చెప్పారన్నారు. కేసులు తమకు కొత్త కాదన్నారు. ప్రజల కోసం పని చేసే క్రమంలో ఇలాంటి వాటిని చాలా ఎదుర్కొన్నామన్నారు. ఇలాంటి కేసులతో కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను ఆపుతామని బీజేపీ భావిస్తే మూర్ఖత్వమే అవుతుందన్నారు.
తనకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కవిత కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘తెలంగాణ తల వంచదు’ అంటూ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, మహిళా సంఘాలతో కలిసి భారత జాగృతి ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టిందని తెలిపారు. ఈ క్రమంలోనే 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ తనకు నోటీసులు జారీ చేసిందన్నారు.
రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపారు. కానీ, ధర్నా, ముందస్తు అపాయింట్ మెంట్స్ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని చెప్పారు.
ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని తెలుసుకోవాలని మండిపడ్డారు కవిత. కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. దేశ అభ్యున్నతి కోసం నిరంతరం గొంతెత్తుతూనే ఉంటామని చెప్పారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు కవిత. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తామని.. ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నానని స్పష్టం చేశారు.