»Minister Harish Rao Praised To Constable Rajashekar
Harish rao on con rajashekar:శభాష్.. రాజశేఖర్, నిండు ప్రాణం కాపాడావు
Harish rao on con rajashekar:కుప్పకూలిన బాలరాజు (balaraju) అనే వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రాజశేఖర్‌ను (rajashekar) నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కూడా స్పందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు.
minister harish rao praised to constable rajashekar
Harish rao on con rajashekar:కుప్పకూలిన బాలరాజు (balaraju) అనే వ్యక్తికి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేసి.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రాజశేఖర్‌ను (rajashekar) నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వావ్.. సరైన సమయంలో.. సీపీఆర్ చేసి నిండు ప్రాణం కాపాడావని అంటున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (harish rao) కూడా స్పందించారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. రాజశేఖర్‌ను (rajashekar) పోలీసులు ఉన్నతాధికారులు, నెటిజన్లు కూడా పొగుడుతున్నారు.
రాజశేఖర్ (rajashekar) ఒకరి నిండు ప్రాణాలను కాపాడారని మంత్రి హరీశ్ రావు (harish rao) ప్రశంసించారు. ఆయన ఒక గొప్ప పని చేశారని తెలిపారు. ఇది మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.వచ్చేవారం ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, కార్యకర్తలకు సీపీఆర్ శిక్షణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. బాలరాజుకు రాజశేఖర్ (rajashekar) సీపీఆర్ చేసిన వీడియోలను ట్వీట్ చేశారు. బాలరాజుకు (balaraju) ఎమర్జెన్సీలో వైద్య సిబ్బంది చికిత్స అందజేస్తున్న పోటో.. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు.
Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గల ఆరాంగర్ చౌరస్తాలో ఈ రోజు ఉదయం 9.30 గంటల సమయంలో బాలరాజు (balaraju) అనే వ్యక్తి కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో కుప్పకూలగా.. పక్కనే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ (rajashekar) అతని వద్దకు వచ్చాడు. పరిస్థితిని గమనించి వెంటనే సీపీఆర్ చేశాడు. కాసేపు చేయగా సృహలోకి వచ్చాడు. తనంతట తాను ఊపిరి తీసుకోవడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడంతో.. అతని ప్రాణాలు దక్కాయి. కానిస్టేబుల్ రాజశేఖర్‌పై (rajashekar) ప్రశంసల వర్షం కురుస్తోంది. నెటిజన్లు పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. వావ్.. యువర్ ఏ సూపర్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కానిస్టేబుల్ రాజశేఖర్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించాడు. ‘కానిస్టేబుల్ రాజశేఖర్ మీకు సెల్యూట్.. మీరు స్పందించిన తీరు, సమయానికి సీపీఆర్ చేయడం ఓ ప్రాణాన్ని నిలబెట్టింది. మీరు కర్తవ్యాన్ని మించి, సాటి మనిషి పట్ల కనికరం చూపారు. మానవత్వానికి, ప్రెండ్లీ పోలీసులకు ఉదాహరణగా నిలిచారు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Salute🫡 to Cyberabad Traffic Police Constable Rajasheker for his alertness & timely CPR that saved a life today.
Sri #Rajasheker, In going beyond your duty & showing compassion to a fellow human you have set an example of humanity & for a caring & friendly police!! 👏 https://t.co/CsG6rF2R69