mayor Vijaya lakshmi : ఎవరినో కుక్క కరిస్తే…. మేయర్ విజయలక్ష్మీ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాద్లో ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారని పేర్కొన్న ఆమె పాలిటిక్స్ లో ఉన్న మహిళల గురించి ఎప్పుడూ బ్యాడ్ గా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేనితనం తట్టుకోలేరు అని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
హైదరాబాద్ మేయర్ గా పని చేయడం అంత ఈజీ కాదని అన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో తనపై ఎన్నో విమర్శలు చేశారని ఆమె క్ష్మి అన్నారు. తానే బాలుడిని కరవమని కుక్కలకు చెప్పినట్లు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్లో మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మహిళలు ముందుకెళ్లాలి అని మేయర్ సూచించారు.
హైదరాబాద్లో ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారని పేర్కొన్న ఆమె పాలిటిక్స్ లో ఉన్న మహిళల గురించి ఎప్పుడూ బ్యాడ్ గా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేనితనం తట్టుకోలేరు అని మేయర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఇక మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ ముందు నగర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోహిత్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఇటీవల కుక్కల దాడిలో మరణించిన బాలుడు ప్రదీప్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.