magunta raghava reddy:10 రోజుల ఈడీ కస్టడీకి మాగుంట రాఘవ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం పుంజుకుంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డిని (magunta raghava reddy) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (cbi court) ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది.
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం పుంజుకుంది. అరెస్ట్ చేసిన మాగుంట రాఘవరెడ్డిని (magunta raghava reddy) కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం (cbi court) ఉత్తర్వులు జారీ చేసింది. రాఘవరెడ్డిని 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించేందుకు కోర్టు అనుమతించింది. కస్టడీ సమయంలో రాఘవను ప్రతిరోజు గంట పాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు వెసులుబాటు కల్పించింది. మాగుంట రాఘవరెడ్డి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta srinivasulu reddy) కుమారుడు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ నిర్ధారించింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రాఘవరెడ్డిని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది. ఈ కేసులో రాఘవరెడ్డిని సీబీఐ కూడా గతంలో ప్రశ్నించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (YCP MP Magunta Srinivasula Reddy) కుమారుడు మాగుంట రాఘవరెడ్డి (Raghav Reddy)ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లో మాగుంట పాల్గొన్నట్టు తెలిసింది. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి (Rajesh Joshi) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటివరకు 9 మంది (9 members) అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు.