సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో బీఆర్ఎస్లోకి మధ్యప్రదేశ్ సామాజిక కార్యకర్త ఆనంద్ రాయ్ (Anand Roy) చేరారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనంద్‌రాయ్ ఆర్టీసీ, ట్రైబల్ రైట్స్ యాక్టివిస్ట్‌గా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి మధ్యప్రదేశ్‌లో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్(Vyapam scam)ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన ఆనంద్ రాయ్. మధ్యప్రదేశ్‌లో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న “జై ఆదివాసి యువశక్తి సంఘటన్ (జేఏవైఎస్)” గిరిజన హక్కుల వేదిక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా జేఎవైఎస్ ఫౌండర్ విక్రమ్ అచ్చాలియా మాట్లాడుతూ.. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీల అభివృద్దే ధ్యేయంగా పాలన కొనసాగుతున్నాయని అన్నారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా బీఆర్ఎస్ ఎదుగుతున్నదని ఆకాంక్షించారు. పార్టీలో చేరిన వారిలో జేఏవైఎస్ ప్రస్తుత అధ్యక్షుడు లాల్ సింగ్ బర్మన్(Lal Singh Burman), పంచం భీల్, అశ్విన్ దూబె, గాజీరామ్ బడోలే, కైలాశ్ రాణా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జాయ్స్ జాతీయ అధ్యక్షుడు లోకేష్ ముజాల్దా, వుమన్ ఇన్చార్జీ సీమా వాస్కాలె, మధ్యప్రదేశ్ అధ్యక్షుడు రాందేవ్ కకోడియా ఉన్నారు.