»Kodad Cm Kcr Allegations On Congress Gives 3 Hours Current For Farmers
CM KCR: సూర్యాపేట, కోదాడ మధ్యలో డ్రైపోర్టు.. ప్రకటించిన కేసీఆర్
వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.
CM KCR: వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆనాడు గోల్ మాల్ చేసిన తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేశారన్నారు. నాగార్జున సాగర్ ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా ఇంకో 20 కిలోమీటర్ల ఎత్తులో కట్టాల్సిందని.. తాము అధికారంలలోకి వస్తే సాగర్ ఆయకట్టుకు మరో పంటకు కూడా నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితమే కృష్ణలో కాళేశ్వరం జలాలు కలిపేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
రెండు పంటల సాగుకు కృష్ణకు గోదావరి జలాలను తీసుకవస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ఓటర్లు అర్ధం చేసుకోవాలని కోరారు. బీసీ బిడ్డ బొల్లం మల్లయ్య యాదవ్ కు నవంబర్ 30న భారీ ఓట్లు వేసి గెలిపించాలన్నారు. కోదాడలో బీసీలకు ఎప్పుడు అవకాశం రాలేదు.. నేనే బీసీకు అవకాశం కల్పించాలని నేనే పిలిచి సీటు ఇచ్చానన్నారు. గెలవడని ఎంతమంది చెప్పిన టికెట్ ఇచ్చి గెలిపించానన్నారు. కోదాడలో ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు బీసీలు ఐక్యం కావాలని సూచించారు. ప్రతీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవ్వరు గెలవాలో.. చర్చించి బీసీ బిడ్డకు అండగా నిలవాలని కోరారు. కోదాడలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నందున మల్లయ్య యాదవ్ ను గెలిపిస్తే రూ. 10 కోట్లతో బీసీ భవన్ నిర్మాస్తామని హామీ
బాధ్యత గల కాంగ్రెస్ నాయకులు, భట్టి విక్రమార్క కు నడిగూడెం, మునగాల, మోతె మండలాలకు కాళేశ్వరం జలాలు వచ్చినాయన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు. పదేళ్ళలో తెలంగాణలో కరువు లేదన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంది బీఆర్ఎస్ నే, మీకు కరెంటు 24 గంటలు కావాలా… లేదా 3 గంటలు కావాలా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి 24 గంటలు మేము కరెంటు ఇస్తే 5 గంటలు ఇస్తామనడం హాస్యాస్పదం అన్నారు. రైతుబంధు వేస్ట్ అన్న కాంగ్రెస్ కావాలా.. అని మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలా రైతు బంధువుగా నిలిచిన బీఆర్ఎస్ కావాలా అని ప్రశ్నించారు. సూర్యాపేట, కోదాడ మధ్యలో డ్రైపోర్టు రానున్నట్లు తెలిపారు. కారుకు గుర్తుకు ఓటు వేసి మల్లయ్య యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.