బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి (Bharat Jagruti) సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రజల నుంచి అరుదైన బతుకమ్మ పాటల సేకరణకు జాగృతి శ్రీకారం చుట్టింది. రాబోతున్న బతుకమ్మ పాట వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రజల సహకరంతో అరుదైన, ప్రాచీన నూతన సాంగ్స్ (New Songs)సేకరిస్తున్నాట్లు ఆమె తెలిపారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతో పాటు భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కోడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడడం వీడియోలో కనిపించింది.
భారత్ జాగృతి యాప్ లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు (Bathukamma songs) ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను సేకరిస్తున్నారు. అలాంటి పాటలను భారత్ జాగృతితో పంచుకోవడం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ కూడా కేటాయించింది. 8985699999 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఆ పాటలను పంపించాలని కవిత విజ్ఞప్తి చేశారు. అంతేకాక తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత్ జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటలు సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన భారత్ జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీను(Kodari Srinu)ను కల్వకుంట్ల కవిత అభినందించారు.
Rejoicing the beautiful #Bathukamma journey with our popular and celebrated folk singers! @BharatJagruthi has a repository of Bathukamma Songs, with great efforts to save the native language and tunes we collected songs from our older generation. If you think that we may have… pic.twitter.com/KhH70p8A7a