K Srinivas Reddy : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ జర్నలిస్టు, ప్రజాపక్షం ఎడిటర్ కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారని జీవోలో పేర్కొన్నారు. శ్రీనివాస్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ పదవిలో నియమితులయ్యారు. దేశంలో జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి నియామకం పట్ల ఐజేయూ, టీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే నాయకులు హర్షం వ్యక్తం చేశారు.