జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషన్ పీరియడ్ ఈ నెల 11తో ముగిసిందని, గడువు ముగిసిన పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని వారు అన్నారు
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఈనెల 28 నుంచి సమ్మెకు దిగుతామని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (JPS) ప్రకటించారు.మూడేళ్లు సర్వీస్ పూర్తిచేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ (Regular) చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం పై జేపీఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా మరో ఏడాది కాలం ఈ నెల 11 నాటికి మొత్తంగా నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన తమను రెగ్యులర్ చేయకపోవడంపై జిపిఎస్ లు ఆందోళన బాట పడుతున్నారు. ఈనెల 17న హైదరాబాదు(Hyderabad)లో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామపంచాయతీకి కార్యదర్శులుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2019లో 9,352 మంది జేపీఎస్‌ల నియామకాలు చేపట్టింది. మొదటి ఏడాది పాటు శిక్షణ కాలం ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచి, వేతనాన్ని రెట్టింపు చేసింది. అప్పటివరకు ఇస్తోన్న రూ.15 వేలను రూ.29 వేలకు పెంచింది.
అయితే ఏడాదిపాటు ప్రొబెషన్ పీరియడ్‌ను నాలుగేళ్లకు పెంచడంతో పాటు పని ఒత్తిడి భారీగా పెరగడంతో ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమయ్యారు తెలంగాణకు హరితహారం (Haritaharam)కార్యక్రమంలో మొక్కలు ఎండిపోకుండా.. గ్రామ పంచాయతీల అభివృద్ధికి పాటుపడే వారిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. వారికి ఇచ్చిన నియామక పత్రాల్లోనూ మూడేళ్ల కాంట్రాక్టు (Three year contract) కాలపరిమితి తర్వాత ఉద్యోగాలు (jobs)రెగ్యులర్ అవుతాయని స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అదనంగా దీన్ని మరో ఏడాది ప్రభుత్వం పొడిగించింది. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా తమను రెగ్యులర్ చేయకపోవడంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాము సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని జూనియర్ కార్యదర్శులు చెబుతున్నారు. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.