తెలంగాణలో మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నేత అయిన వినోద్ ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇంటిని కూడా ఐటీ అధికారులు తనిఖీ చేశారు.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల కోడ్ (Election Code) అమలులో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ (Election Commission) పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గత కొన్ని రోజుల నుంచి ఈడీ (ED) అధికారులు రాజకీయ నేతలు, సెలబ్రిటీల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ బెల్లంపల్లి అభ్యర్థి అయిన జి.వినోద్ నివాసంలో అధికారులు తనిఖీలు చేశారు.
వినోద్‌తో పాటుగా మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అయూబ్ ఇంటిని, వారి కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఆ విషయంపై గతంలోనే తెలంగాణ ఏసీబీ మూడు ఛార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న వినోద్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న వివేక్ వెంకటస్వామి ఇంటిని, కార్యాలయాన్ని ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ఆ సంస్థ నుంచి సుమారు రూ.8 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా వారికి ఫిర్యాదు అందిందని, అందుకే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ తనిఖీలపై వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 12 గంటలు తనిఖీలు చేసి ఆఖరికి వట్టి చేతులతో వెళ్లారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల మధ్యకు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఐటీ రైడ్స్ చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు సూచించారు.