కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక(Stage) కూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు ఉన్న ఫళంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి.
Gangula Kamalakar: తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) కు ఆదివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా(Karimnagar)లోని చెర్లబూట్కూర్ లో సభా వేదిక(Stage) కూలడంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర నేతలు ఉన్న ఫళంగా కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో మంత్రి కమలాకర్ సురక్షితంగా బయటపడ్డారు. మంత్రి గంగుల కమలాకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. వేదికపై పరిమితికి మించి నాయకులు కార్యకర్తలు ఎక్కడంతో సభా వేదిక కుప్పకూలింది. దీంతో మంత్రి(Minister) సహా సభా వేదికపై ఉన్న వారంతా కిందపడ్డారు. ఈ ప్రమాదంలో జడ్పీటీసీ సభ్యుడికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రి(Hospital)కి తరలించారు. ప్రమాద ఘటనపై మంత్రి వివరణ ఇస్తూ.. సభా వేదికపై నుండి కింద పడ్డ ఘటనలో తనకు స్వల్పంగానే గాయాలైనట్టుగా మంత్రి కమలాకర్ తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ చేశారని చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కమలాకర్ ప్రకటించారు.
గతంలోనూ.. మంత్రి గంగుల కమలాకర్ ఎస్కార్ట్ వాహనం(escort vehicle) ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరులో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి వస్తున్న సందర్భంగా ఆయన కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొత్తపల్లి ఎస్సై ఎల్లా గౌడ్ గాయపడ్డారు. ఆయన బొటనవేలు తెగిపడినట్టు సమాచారం.