తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ సై అంటే సై అంటుండగా.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) కూడా కసరత్తు ప్రారంభించింది. ముగ్గురు సీనియర్ అధికారుల బృందం ‘తెలంగాణ ఎన్నికల’పై సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు
తెలంగాణ (Telangana) లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్(Central Election Commission) డిప్యుటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్(Hyderabad)లో పర్యటించారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్(Vikas Raj), ఇతర సీనియర్ అధికారులతో ఈ బృందం సమావశమై కీలక అంశాలపై చర్చించింది. ఓటర్ల జాబితా, మార్పులు, చేర్పులు, ఈవీఎం(EVM)ల సన్నద్ధత, ఇతర అంశాలపై ఈ బృందం రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమావేశమై సమీ క్షించింది. లోటుపాట్లు లేకుండా, ఎటువంటి అవకతవకలకు ఆస్కారంలేని రీతిలో ఓటర్ల జాబితాను రూపొందించేలా నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. రిటర్నింగ్ అధికారుల(Returning Officer) సమగ్ర జాబితాను సిద్ధం చేయాలని సీఈవో వికాస్‌రాజ్‌కు ఈ బృందం ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 1నుంచి ఈవీఎంల మొదటి దశ పరిశీలన చేపట్టాలని, జిల్లా ఎన్నికల అధికారులకు రెండు రోజుల శిక్షణా తరగతుల సెమినార్‌ను త్వరలో నిర్వహించాలని ఆదేశించారు. ఈసీఐఎల్(ECIL) సరఫరా చేసిన ఈవీఎంలను పరీక్షించి జిల్లాలకు పంపిణీ చేసినట్లు సీఈవో వికాస్‌రాజ్ వెల్లడించారు.2024 జనవరి 16తో తెలంగాణ అసెంబ్లీకి పదవీకాలం ముగుస్తుంది. 2013 డిసెంబర్ (December) నెలాఖరు వరకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దీనికి రెండు నెలల ముందే షెడ్యూల్(Schedule) ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల విధుల్లో పాలు పంచుకునే అన్ని స్థాయిల అధికారులకు, ఇంకా విధులు నిర్వహించే ఇతర సిబ్బందికి శిక్షణ కోసం ప్రణాళిక రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఈ సందర్భంగా సూచించింది. ఓటర్ల (voters)నమోదు, ఎన్నికల్లో భాగస్వామ్యం, పోలింగ్ శాతం పెంపు వంటి అంశాలపై ప్రజల్లో ప్రచారం చేసి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.