NRPT: జిల్లా కేంద్రంలో గురువారం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ సయ్యాట ఉత్సాహంగా జరిగింది. డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి వేడుకలను ప్రారంభించారు. భారంభావి నుంచి పాత గంజ్ వరకు ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులను ఊరేగింపుగా తీసుకొచ్చి, వాటితో విన్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.