JGL: ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి ఉండాలని TUWJ జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాలలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు యూనియన్లో సభ్యత్వం కల్పిస్తామని, నవంబర్ 10 లోగా సభ్యత్వం పొందిన జర్నలిస్టులందరికీ ఐడీ కార్డులను అందజేస్తామని పేర్కొన్నారు.