SRPT: పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సీపీఐ పార్టీ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కాల్వపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన రుణమాఫీ నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.