MNCL: బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ తిరుమలలోని TTD ఛైర్మన్ బి.ఆర్. నాయుడుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి తిరుమల దేవస్థానం అభివృద్ధి, భక్తులకు అందించే సేవలు, మౌలిక వసతుల విస్తరణ, తీర్ధప్రసాదాల వ్యవస్థ, విచారణలో ఉన్న ఇతర విధానపరమైన అంశాలపై ఇరువురు చర్చించారు. TTD అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.