PDPL: యాసంగి పంట కొనుగోలులో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ముత్తారం మండల కేంద్రం, మచ్చుపేట, పారుపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరగాలన్నారు.