MDK: సైబర్ మోసగాళ్ల చేతిలో విద్యార్థి మోసపోయిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. వివరాలు.. BVRIT కాలేజీ విద్యార్థికి వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ చేయగా రెస్టారెంట్‌కు రేటింగ్ ఇస్తే డబ్బులు ఇస్తామని అందులో ఉంది. దీంతో రేటింగ్స్ పంపిన విద్యార్థికి కొంత డబ్బు వచ్చింది. అనంతరం పలుమార్లు తన ఖాతా నుంచి రూ. 28,500 కట్ కావడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.