WGL: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓని పర్వతగిరి మండలానికి చెందిన పలువురు ఈరోజు కలిసి ఫిర్యాదు చేశారు. అన్నారం దర్గా వద్ద తలనీలాలను రెండేళ్లుగా టెండర్ వేయకుండా వెంట్రుకలు పోగుచేసి అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు దొంగతనంగా తలనీలాలు అమ్ముకొని, వక్ఫ్ బోర్డు ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు.