BDK: అంబేద్కర్ కృషి వల్లే ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు తమ హక్కులను పొందుతున్నారని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కూనంనేని నివాళి అర్పించారు. వారి ఆశయ సాధనలో నడవాలన్నారు.