WGL: బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రమేశ్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలోని హెడ్ పోస్టాఫీస్, సెంటర్లో శుక్రవారం నిరసన చేపట్టారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో పాలకవర్గాలకు చిత్తశుద్ధి లేదనడానికి హైకోర్టు స్టేనే కారణమన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారన్నారు.