JGL: రాయికలం మండలం వీరాపూర్‌లో నీరు రావడంలేదని మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ ఎదుట నిరసన చేపట్టారు. మహిళలు మాట్లాడుతూ.. నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత కొన్ని రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు.