NRML: నిర్మల్ నియోజకవర్గం కడ్తాల్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట తెగిపోవడంతో బుధవారం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిస్థితులను పరిశీలించారు. రైతులకు పంట నష్టం జరిగిందని గుర్తించి, వారికి ప్రభుత్వం తరఫున పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.