KMM: సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్ మాంజా విక్రయాలు, వాడకంపై ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ దారం అత్యంత పదునుగా ఉండట వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారుల గొంతు, చేతులకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ మాంజాను వాడరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.