NGKL: వంగూరు మండలంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9 గంటలకు తిప్పారెడ్డిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 10 గంటలకు నిజాంబాద్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వంగూరు మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.