KMR: రాజంపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హులకు కాకుండా అనర్హులకు కేటాయించారని ఆరోపిస్తూ బుధవారం రాజంపేట గ్రామస్థులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మొదటి, రెండో విడుతలో తమకు ఇండ్లు మంజూరు అయినట్లు సమాచారం ఉందని ఇప్పుడు తమకు ఇండ్లు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు.