KMM: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మంలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు అర్హత పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సైనిక్ స్కూల్ అర్హత పరిశీలనలో భాగంగా వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అర్హత పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.