HYD: బొల్లారం, నాచారం ఇండస్ట్రియల్ ఏరియాల్లో రోజురోజుకు పొల్యూషన్ పెరుగుతుంది. ఓవైపు డస్ట్ న్యూసెన్స్, మరోవైపు హానికర వాయువులు రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా వివిధ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. గత నాలుగు నెలలుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీలలో తనిఖీలు నిర్వహించకపోవడంపై, పరిసర ప్రాంతాల్లో ఉన్న నివాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.