VKB: జిల్లా కలెక్టరేట్లో మంగళవారం విజిలెన్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. విజిలెన్స్ ఇన్ఫర్మేషన్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ‘ప్రతి ఉద్యోగి విధినిర్వహణలో నిజాయితీగా పనిచేయాలి. అభివృద్ధి పనులను అవినీతి రహితంగా చేపట్టాలి. సరైన విధంగా నిర్వహించి అవినీతి రహితంగా పని చేయాలి’ అని కలెక్టర్ ప్రతీక్ జైన్ సిబ్బందికి సూచనలు చేశారు.