RR: మరికొద్దిసేపట్లో బాలాపూర్ లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది. 1994లో తొలిసారి బాలాపూర్ లడ్డును వేలం వేశారు. మొదటి సంవత్సరం రూ. 450 వేలం పాట పాడగా, 2002లో 1,05,000 పలికింది. గత ఏడాది లడ్డు రూ.30,01,000 ధర పలికి రికార్డు సృష్టించింది. ప్రతీ ఏడాది జరిగే వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలకగా.. ఈ ఏడాది ఎంత పలుకుతుందో వేచి చూడాల్సిందే.