సత్యసాయి: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శనివారం యూరియా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ మట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. యూరియా స్టాక్, సరఫరా పర్యవేక్షణలో ఆర్డీవోలు, వ్యవసాయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశిస్తూ, తగు సూచనలు జారీ చేశారు.