SRPT: ఆదివారం మోతె మండలం రాఘవాపురంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నూతన ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.