SRD: మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తూ తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల గిరిజన వసతి గృహ విద్యార్థులు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. వసతి గృహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి గేటు వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సత్తయ్య గౌడ్ విద్యార్థుల వద్దకు వచ్చి మాట్లాడారు. విద్యార్థులు ఆందోళన విరమించారు.