JNL: కథలాపూర్ మండల కేంద్రంలో ఇవాళ రోజున మండల బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులు,మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మారుతి, శ్రీనివాస్, మారుతి, మహేష్ శాంతారాం, సునీల్, అనిల్, ప్రసాద్ పాల్గొన్నారు.